Satyadev: ఓటీటీ స్ట్రీమింగ్‌లోకి సత్యదేవ్‌ కొత్త సినిమా

విభిన్న డైలాగ్‌ డెలివరీ, నటనతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్(Satyadev)‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘గాడ్సే’ (Godse). పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్...

Published : 15 Jul 2022 11:53 IST

రిలీజ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..?

హైదరాబాద్‌: విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్(Satyadev)‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘గాడ్సే’ (Godse). పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా జులై 17 నుంచి అందుబాటులోకి రానుంది. గోపీ గణేశ్‌ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 17న థియేటర్లలో విడుదలై అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

కథేంటంటే:

ప్రజాస్వామ్య వ్యవస్థలో పలువురు రాజకీయ నాయకులు పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతూ తెరకెక్కిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘గాడ్సే’. టైటిల్‌ రోల్‌లో సత్యదేవ్‌ నటించారు. విశ్వనాథ్ రామచంద్ర అలియాస్‌ గాడ్సే(సత్యదేవ్) లండన్‌లో పేరు పొందిన వ్యాపారవేత్త. అర్హులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే గొప్ప సంకల్పంతో ఆయన భారత్‌కు వస్తారు. అయితే, భారత్‌కు వచ్చిన అనంతరం పలువురు రాజకీయ నాయకులు, పోలీస్‌ సిబ్బందిని ఆయన కిడ్నాప్‌ చేసి హతమారుస్తాడు. ఈ కేసును చేధించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్యలక్ష్మీ)ని నియమిస్తుంది. అసలింతకీ ఈ గాడ్సే ఎవరు? అతని గతమేంటి? ప్రజాప్రతినిధులను ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? వైశాలి ఈ కేసును ఎలా చేధించింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని