‘లూసిఫర్‌’ రీమేక్‌లో సత్యదేవ్‌..?

‘బ్లఫ్‌ మాస్టర్‌’తో తనలోని నటుడ్ని సినీ ప్రియులకు పరిచయం చేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు నటుడు సత్యదేవ్‌. అటు సినిమాలతోపాటు ఇటు వరుస వెబ్‌ సిరీస్‌లలో హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా నటిస్తూ...

Updated : 02 Jan 2021 12:45 IST

కీ రోల్‌ పోషించనున్న నటుడు

హైదరాబాద్‌: ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో తనలోని నటుడిని సినీ ప్రియులకు పరిచయం చేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు నటుడు సత్యదేవ్‌. అటు సినిమాలతోపాటు ఇటు వరుస వెబ్‌ సిరీస్‌లలో హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తున్న ఈ టాలీవుడ్‌ హీరో త్వరలో మెగాస్టార్‌తో స్ర్కీన్ పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

మలయాళీ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం సత్యదేవ్‌తో సంప్రదింపులు జరపగా.. మెగాస్టార్‌ చిత్రంలో నటించడానికి ఈ టాలీవుడ్‌ హీరో అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మలయాళంలో టోవినో థామస్‌ లేదా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతేడాది చివర్లో మెగాస్టార్‌-సత్యదేవ్‌ కలిసి దిగిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్రలో రామ్‌చరణ్‌ నటించవచ్చని కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చదవండి

చిరు ‘లూసిఫర్‌’కు సారథి ఖరారు

వైరల్‌గా మారిన సెలబ్రిటీ జంటల ఫొటోలు

సామజవరగమనా.. తమన్‌ జోరు ఆపతరమా

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు