Sebastian PC 524: రేచీకటి కానిస్టేబుల్ కష్టాలివే..!
యువ నటుడు కిరణ్ అబ్బవరం, నువేక్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. రేచీకటి ఉన్న కానిస్టేబుల్.. వృత్తిరీత్యా ఎలాంటి ఇబ్బందులు...
‘సెబాస్టియన్ పీసీ 524’ ట్రైలర్ వచ్చేసింది
హైదరాబాద్: యువ నటుడు కిరణ్ అబ్బవరం, నువేక్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. రేచీకటి ఉన్న కానిస్టేబుల్.. వృత్తిరీత్యా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చేయని తప్పునకు ఏం శిక్ష అనుభవించాడు? అనే ఆసక్తికర అంశాలతో కామెడీ, రొమాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు.. ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. మార్చి 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘సెబాస్టియన్’ ట్రైలర్‌ను సోమవారం ఉదయం విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
‘‘అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెబాస్టియన్ ఇక్కడ వీచే గాలి, లేని వెలుతురు, ఉన్న చీకటి సాక్షిగా..’’ అని హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ప్రతి సన్నివేశంలో కిరణ్ అబ్బవరం నటన ఆకట్టుకునేలా సాగింది. ‘‘అమ్మా.. నువ్వు ఏం కంగారు పడకు. ఇన్ని రోజులు మేనేజ్ చేసి ఇంతదూరం వచ్చా.. జాబ్ మేనేజ్ చేయలేనా? చాలా ఈజీగా మేనేజ్ చేస్తా’’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు మెప్పిస్తున్నాయి. ‘‘పోలీసోడు ట్రాన్స్‌ఫర్ అయితే వెళ్లేది పోలీస్‌స్టేషన్‌కే. పోస్టాఫీస్‌కు కాదు’’ అంటూ ట్రైలర్ చివర్లో హీరో చెప్పే సినిమా డైలాగ్‌లు నవ్వులు పూయించేలా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs ENG: ఒక్క బంతీ పడలేదు.. భారత్- ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ రద్దు
-
TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
-
Kerala: నిఫా నాల్గో వ్యాప్తిలో.. మరణాల శాతం ‘33’కే కట్టడి!
-
Nadendla Manohar: ఏపీకి జగన్ అవసరం లేదు: తెనాలిలో నాదెండ్ల మనోహర్
-
Ashwin : ఇదే నా చివరి వరల్డ్ కప్ కావచ్చు.. ఆలస్యంగా జట్టులోకి వచ్చినందుకు బాధేం లేదు: అశ్విన్
-
Sri Sri Ravi Shankar: ప్రపంచమంతా ఒకే కుటుంబం: శ్రీశ్రీ రవిశంకర్