Sebastian: ఒక రాత్రి వీళ్లకీ కళ్లు కనబడకుండా చూడు: కిరణ్‌ అబ్బవరం

‘‘దేవుడా.. ఒక రాత్రి వీళ్లక్కూడా కళ్లు కనబడకుండా చూడు. ఎన్ని వణుకుతాయో వీళ్లకీ  తెలుస్తుంది’’ అని అంటున్నారు నటుడు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా...

Published : 05 Feb 2022 11:42 IST

ఆకట్టుకునేలా ‘సెబాస్టియన్‌’ టీజర్‌..!

హైదరాబాద్‌: ‘‘దేవుడా.. ఒక రాత్రి వీళ్లక్కూడా కళ్లు కనబడకుండా చూడు.. ’’ అని అంటున్నారు నటుడు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘సెబాస్టియన్‌ పీసీ524’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

రేచీకటి ఉన్న వ్యక్తి పోలీస్‌ కానిస్టేబులైతే అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? ముఖ్యంగా స్టేషన్‌లో నైట్‌ డ్యూటీ వేస్తే అతడి పరిస్థితి ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ‘‘నీకు రేచీకటన్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దయ్యా’’ అనే మాటలతో ప్రారంభమైన టీజర్‌లోని ప్రతి సన్నివేశం నవ్వులు తెప్పించేలా ఉంది. నైట్‌ డ్యూటీ సమయంలో స్టేషన్‌లో ఉన్న సెబాస్టియన్‌.. ‘‘దేవుడా.. ఈ రోజు మదనపల్లి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడు’’ అని కోరుకోవడం కామెడీగా అనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని