Kalyan ram: అబ్బాయి చిత్రంలో బాబాయ్ పాట
‘బింబిసార’ వంటి విజయం తర్వాత కల్యాణ్ రామ్ (Kalyan Ram) నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘అమిగోస్’ (Amigos). రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
‘బింబిసార’ (Bimbisara) వంటి విజయం తర్వాత కల్యాణ్ రామ్ (Kalyan Ram) నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘అమిగోస్’ (Amigos). రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఆషికా రంగనాథ్ కథానాయిక. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో కల్యాణ్‌రామ్ తన అభిమానులతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన బాబాయ్ బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘ధర్మక్షేత్రం’లోని ‘‘ఎన్నో రాత్రులొస్తాయి గాని’’ పాటను ‘అమిగోస్’లో రీమిక్స్ చేసినట్లు తెలియజేశారు. ఈ గీతాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ‘‘ఎన్నో రాత్రులొస్తాయి’’ పాటను ఇళయరాజా స్వరపరచగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంయుక్తంగా ఆలపించారు. ఇప్పుడీ గీతాన్ని జిబ్రాన్ సరికొత్తగా రీమిక్స్ చేశారు. మరి దీన్ని ఎవరు ఆలపించారు? తెరపై ఎలా ఉండనుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే పోలికలున్న ముగ్గురు వ్యక్తుల కథగా ఈ చిత్రం ఉండనుంది. ఈ సినిమాకి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Gas Cylinder : తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
-
Politics News
Rahul Gandhi : నేడో, రేపో ‘రాహుల్ పిటిషన్’!
-
India News
Punjab: గుర్రాల పెంపకంతో భలే ఆదాయం
-
India News
Digital Water Meters: అపార్ట్మెంట్లలో డిజిటల్ వాటర్ మీటర్లు
-
Ap-top-news News
Covid Tests: శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు
-
Politics News
అన్న రాజమోహన్‌రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!