‘పెప్సీ’భామ వచ్చేసింది!

గోపీచంద్‌, తమన్నా జంటగా సంపత్‌నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’.కబడ్డీ ఆట ప్రధానాంశంగా మాస్‌ అంశాలతో తెరకెక్కుతున్న కమర్షియల్‌ చిత్రం. ఇప్పటికే విడుదలైన ‘సీటీమార్‌’ టైటిల్‌సాంగ్‌ స్ఫూర్తివంతంగా ఉంది. తాజాగా విడుదలచేసిన

Published : 21 Mar 2021 14:07 IST

హైదరాబాద్: గోపీచంద్‌, తమన్నా జంటగా సంపత్‌నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ ఆట ప్రధానాంశంగా మాస్‌ అంశాలతో తెరకెక్కుతున్న కమర్షియల్‌ చిత్రం. ఇప్పటికే విడుదలైన ‘సీటీమార్‌’ టైటిల్‌సాంగ్‌ ఆకట్టుకుంది. తాజాగా విడుదలచేసిన స్పెషల్‌సాంగ్‌ ‘పెప్సీ ఆంటీ’ మాస్‌ ప్రేక్షకులను ఊర్రుతూలుగించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్సరరాణి ఈ పాటలో యమ హుషారుగా నర్తించింది. ఈ సాంగ్‌ను కీర్తన శర్మ ఆలపించగా, మణిశర్మ స్వరపర్చారు. సంపత్‌నంది సాహిత్యం అందించటం విశేషం. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై చిట్టూరి శ్రీనివాసరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ సాంగ్‌పై మీరు ఓ లుక్కేసుకోండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని