Sehari: సినిమా చూశాక నాపై అభిప్రాయం మార్చుకుంటారు: ‘సెహరి’ హీరో హర్ష్‌

‘‘సెహరి’ చిన్న సినిమానే అవ్వొచ్చు కానీ ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్ చేస్తుంది. మాకున్న బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో తెరకెక్కించాం. ఎవరూ ఇలా చేసుండరు’’ అని  హర్ష్‌ కనుమిల్లి అన్నారు.

Published : 08 Feb 2022 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘సెహరి’ చిన్న సినిమానే అవ్వొచ్చు కానీ ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్ చేస్తుంది. మాకున్న బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో తెరకెక్కించాం. ఎవరూ ఇలా చేసుండరు’’ అని హర్ష్‌ కనుమిల్లి అన్నారు. ఈ చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్నారు. జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.

హర్ష్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు జ్ఞానసాగర్‌ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. అతడు పెద్ద దర్శకుడు అవుతాడనే నమ్మకం నాకుంది. ఈ సినిమా కథానాయిక సిమ్రన్‌ చౌదరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ సినిమాలోని ‘ర్యాప్‌ బ్యాటిల్‌’ కొత్త అనుభూతి పంచుతుంది. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేసేందుకే దాన్ని విడుదల చేయలేదు. థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి. నాన్‌స్టాప్‌గా మిమ్మల్ని నవ్వించాలనే ఆలోచనతోనే ఈ చిత్రాన్ని రూపొందించాం. ట్రైలర్‌ విడుదల ప్రెస్‌మీట్‌లో నేను అతి విశ్వాసం (ఓవర్‌ కాన్ఫిడెన్స్‌)తో మాట్లాడానని చాలా మంది అన్నారు. కానీ, సినిమా చూశాక నాపై అభిప్రాయాన్ని మార్చుకుంటారు. తప్పకుండా అందరినీ అలరిస్తా’’ అని అన్నారు. ఈ వేడుకలో చిత్ర దర్శకుడు జ్ఞానసాగర్‌, కథానాయిక సిమ్రన్‌ చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌.విహారి తదితరులు పాల్గొన్నారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు