Sekhar: సరికొత్త మహేష్‌ను చూస్తారు
‘‘స్టార్ హీరోతో పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఏమీ ఉండదు. ఒక పాటను మించిన పాట అందివ్వాలని పట్టుదల ఉంటుంది. దానికోసం నేనెంత కష్టానికైనా వెనుకాడను’’ అన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.
‘‘స్టార్ హీరోతో పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఏమీ ఉండదు. ఒక పాటను మించిన పాట అందివ్వాలని పట్టుదల ఉంటుంది. దానికోసం నేనెంత కష్టానికైనా వెనుకాడను’’ అన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఆయన ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’లోని కళావతి, పెన్నీ, టైటిల్ పాటలకు నృత్యరీతులు అందించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పరశురామ్ తెరకెక్కించారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శేఖర్ మాస్టర్. ఆ సంగతులు..
ఓ పాట విజయంలో కొరియోగ్రఫీ పాత్ర ఎంత ఉంటుంది? పాట విషయంలో దర్శకులకు మీరెలాంటి సలహాలిస్తారు?
‘‘కొరియోగ్రఫీది కీలకమైన పా్రత్రే. అయితే ముందు సంగీత దర్శకుడి నుంచి మంచి ట్యూన్ రావాలి. దానికి అందంగా కొరియోగ్రఫీ కుదిరితే పాట విజయవంతం అవుతుంది. సాంగ్‌ని అందంగా చూపించాల్సిన బాధ్యతా మాపై ఉంటుంది. మూమెంట్స్‌తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతి దానిపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ విషయంలో దర్శకులు మాకు సూచనలు ఇస్తారు. కొన్నిసార్లు మేమే ఎలా ఉంటే బాగుంటుందో చెబుతాం. ‘కళావతి’ గీతాన్ని ఫారిన్లో షూట్ చేశాం. బ్యాగ్రౌండ్లో సితారలు ఉంటే బాగుంటుంది అనిపించింది. పరశురామ్‌కు చెబితే ఓకే అన్నారు. కాస్త ఖర్చు ఎక్కువైనా అప్పటికప్పుడు వేరే చోట నుంచి వాటిని తెప్పించి పాట పూర్తి చేశాం’’.
కొరియోగ్రఫీలో ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తోంది?
‘‘ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కానీ, ‘ఇద్దరమ్మాయిలతో’లోని టాపు లేచిపోద్ది పాటను అప్పట్లోనే ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. ‘అల.. వైకుంఠపురములో’, ‘పుష్ప’ మూమెంట్స్ పాన్ వరల్డ్‌లో సందడి చేశాయి. మూమెంట్ విభిన్నంగా, క్యాచీగా ఉంటే జనాల దృష్టి ఆటోమేటిక్‌గా పాటపై పడుతుంది. ఒక పాటలో అందరూ చేయగలిగే రెండు యూనిక్ స్టెప్స్ ఉంటే చాలు.. అది సోషల్ మీడియా రీల్స్‌లోకి వెళ్లి హిట్ అవుతున్నాయి’’.
ఓ డ్యాన్స్ మాస్టర్‌గా మీకు బాగా నచ్చే హీరో ఎవరు?
‘‘నేను పని చేసే ప్రతి హీరో నాకు దేవుడితో సమానం. నన్ను నమ్మి పాట ఇస్తున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి కష్టపడి పని చేయడం ఒక్కటే నాకు తెలుసు. ఏ హీరో అయినా సరే ఒక్కసారి చెప్పిన వెంటనే మూమెంట్స్ పట్టేస్తారు. ఎన్టీఆర్ మాత్రం రిహార్సల్స్ లేకుండానే స్పాట్లో స్టెప్ చూసి, చేసేస్తారు. ప్రస్తుతం తమిళంలో శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. తెలుగులో చిరు154, రవితేజ ‘ధమాకా’ చిత్రాలకు చేస్తున్నా. రాజమౌళి, పవన్ కల్యాణ్‌ల కోసం పని చేయాలని ఉంది’’.
‘సర్కారు వారి పాట’లో పాటలెలా ఉంటాయి? మహేష్‌తో పని చేయడం ఎలా అనిపించింది?
‘‘ఈ సినిమాలో నేను ‘కళావతి’, ‘పెన్నీ’ గీతాలతో పాటు మరో మాస్ పాటకు నృత్యరీతులు అందించా. ఇవన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. త్వరలో రానున్న మాస్ పాట ఫ్యాన్స్‌కు గొప్ప ట్రీట్. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. స్వతహాగానే మహేష్‌లో అద్భుతమైన రిథమ్ ఉంది. డ్యాన్స్ విషయానికొస్తే ఈ సినిమాలో సరికొత్త మహేష్‌బాబును చూస్తారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే