డ్యాన్సర్లు.. నాకు ఫోన్‌ చేయండి: శేఖర్‌ మాస్టర్‌

లాక్‌డౌన్‌ వేల పొట్టకూటి కోసం చాలామంది తిప్పలు పడుతున్నారు. అయితే.. మనకు కనిపించేవారికంటే కనిపించని వారు మరెందరో. డ్యాన్స్‌నే నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చారు. వారంతా ప్రస్తుతం షూటింగ్‌లు లేక టీవీ షోలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Published : 15 May 2021 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ వేళ పొట్టకూటి కోసం చాలామంది తిప్పలు పడుతున్నారు. మనకు రోడ్లపై కనిపించేవారే కాకుండా మరెంతో మంది భోజనానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్యాన్స్‌నే నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చిన డ్యాన్సర్లదీ అదే పరిస్థితి. వారంతా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు లేక టీవీ షోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా.. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ప్రముఖ కొరియోగ్రఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ అండగా నిలబడ్డారు. నిత్యావసర సరకుల కోసం తనను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక వీడియో పంచుకున్నారు.

ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని.. గ్రూప్‌ డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు పని దొరకడం కష్టంగా మారిందన్నారు. ఏదైనా కార్యక్రమాలు, టీవీ షోలు జరిగితే తప్ప వాళ్లకు పని ఉండదని ఆయన చెప్పారు. భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్లు చాలామంది ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారు ఎవరున్నా తనను సంప్రదించాలని సూచించారు. వారికి తమ టీమ్‌ కావాల్సిన సరకులు అందిస్తుందని ఆయన అన్నారు. ఇందుకోసం ఆయన కొన్ని ఫోన్‌ నెంబర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని