Cinema news: ‘యుగానికి ఒక్కడు’పై దర్శకుడు సెల్వరాఘవన్ కీలక వ్యాఖ్య

కార్తీ హీరోగా ఆండ్రియా, రీమాసేన్‌ తదితరులు కలిసి నటించిన తమిళ సినిమా ఆయిరత్తిల్‌ ఒరువన్‌. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైన విషయం తెలిసిందే. 2010లో థియేటర్లలో ప్రదర్శితమైన ఈ సినిమా...

Published : 19 Aug 2021 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తీ హీరోగా ఆండ్రియా, రీమాసేన్‌ తదితరులు కలిసి నటించిన తమిళ సినిమా ఆయిరత్తిల్‌ ఒరువన్‌. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైన విషయం తెలిసిందే. 2010లో థియేటర్లలో ప్రదర్శితమైన ఈ సినిమా..  ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకెళ్లింది. విమర్శకుల మెప్పూ పొందింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన కీలక విషయాన్ని దర్శకుడు గురువారం ట్విటర్‌ వేదికన వెల్లడించారు. ‘ఈ సినిమా వాస్తవ బడ్జెట్‌ రూ.18 కోట్లు. కానీ.. భారీ బడ్జెట్‌ సినిమాగా హైప్‌ తీసుకొచ్చేందుకు రూ.32 కోట్లుగా ప్రకటించాం. ఎంత మూర్ఖత్వం ఇది! ఫలితంగా వాస్తవ పెట్టుబడి వసూలైనా.. సినిమా యావరేజీగా నమోదైంది. దీంతో నేను నేర్చుకున్నది ఏంటంటే.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా.. అబద్ధం చెప్పకూడద’ని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు ధనుష్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆయిరత్తిల్‌ ఒరువన్‌ 2'గా దర్శకుడు సెల్వ ఇప్పటికే టైటిల్‌ ప్రకటించారు. 2024లో విడుదల కానుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని