chandramohan: అవన్నీ వదంతులు.. నమ్మకండి

రెండుమూడు రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ స్పందించారు. అవన్నీ అసత్య వార్తలేనని ఆయన కొట్టి పారేశారు. ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈనెల 23న ఆయన జన్మదినం.

Updated : 25 May 2021 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండుమూడు రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ స్పందించారు. అవన్నీ అసత్య వార్తలేనని ఆయన కొట్టి పారేశారు. ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈనెల 23 ఆయన జన్మదినం. ఆ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సన్నిహితులు చెప్తున్నా వినిపించుకోకుండా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని.. అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చంద్రమోహన్‌కు ఆరోగ్యం బాగాలేదని.. పలు రకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై చంద్రమోహన్‌ తాజాగా స్పందించారు. ఈమేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే.. నా ఆరోగ్యం బాగా లేదంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ అసత్యవార్తలు. మీరెవరూ నమ్మకండి. మీ అభిమానానికి, ఆశీస్సులకు సర్వదా కృతజ్ఞుడిగా ఉంటా. అదే నాకు శ్రీరామ రక్ష. - చంద్రమోహన్.

ప్రధానపాత్ర అయినా.. సహాయక పాత్రలో అయినా.. హీరోగా అయినా.. కమెడియన్‌గా అయినా చంద్రమోహన్‌ ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నారు. హీరోగా 175కు పైగా సినిమాలు చేసిన ఆయన మొత్తం 932 సినిమాల్లో నటించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు