
Published : 30 Jun 2021 18:26 IST
నటి కవిత ఇంట్లో మరో విషాదం
ఇంటర్నెట్ డెస్క్: సీనియర్ నటి కవిత ఇంట్లో మరో విషాదం నెలకొంది. కొవిడ్‌తో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు మరణించారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితమే కుమారుడు సంజయ్ రూప్ సైతం కరోనాతో పోరాడుతూ మృతిచెందారు. దశరథ రాజు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాలనటిగా వెండితెరకు పరిచయమైన కవిత దాదాపు 350 చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోనూ తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపైనా తన సత్తా చాటారు.
ఇవీ చదవండి
Tags :