Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణ దర్శకుడు. ఈ పాన్‌ ఇండియా సినిమా విడుదలను వాయిదా వేసినట్టు చిత్ర బృందం గురువారం ప్రకటించింది.

Published : 29 Sep 2022 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్‌ దర్శకుడు. ఈ పాన్‌ ఇండియా సినిమా విడుదలను వాయిదా వేసినట్టు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. శాకుంతలం ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఈ సినిమాని 3డీ వెర్షన్‌లో తీసుకురాబోతున్నారు. సంబంధిత కార్యక్రమాలకు కొంత సమయం పడుతుండటంతో నవంబరు 4న విడుదల చేయాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తామని నిర్మాణ సంస్థ ‘గుణ టీమ్‌ వర్క్స్‌’ పేర్కొంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని