Shaakuntalam: శాకుంతలం.. వచ్చేది ఆరోజే

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’. నీలిమ గుణ నిర్మాత. దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 4న తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ,

Updated : 24 Sep 2022 13:55 IST

సమంత (Samantha) ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). నీలిమ గుణ నిర్మాత. దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 4న తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో సమంత, దేవ్‌ మోహన్‌ రొమాంటిక్‌ లుక్‌లో కనిపించి.. మురిపించారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నీలిమ గుణ. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: శేఖర్‌ వి.జోసెఫ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని