Shaakuntalam: శాకుంతలం విడుదల ఖరారు

సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 17న తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు సోమవారం ప్రకటించాయి.

Updated : 03 Jan 2023 12:22 IST

మంత (Samantha) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ (Shaakuntalam) విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 17న తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు సోమవారం ప్రకటించాయి. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అజరామరమైన ఈ ప్రేమకథలో శకుంతలగా సమంత... దుష్యంతుడిగా దేవ్‌మోహన్‌ నటించారు. మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్‌, మధుబాల, గౌతిమి కీలక పాత్రలు పోషించారు. యువరాజు భరతుడిగా అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ నటించారు. గుణశేఖర్‌ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది. విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ సినిమాని త్రీడీలోనూ రూపొందిస్తున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. అదితి బాలన్‌, అనన్య నాగళ్ల, జిసుసేన్‌ గుప్తా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: శేఖర్‌ వి.జోసెఫ్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, సంగీతం: మణిశర్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని