Shaakuntalam: ‘శాకుంతలం’ ట్రైలర్‌ వచ్చేస్తోంది

కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam).

Updated : 07 Jan 2023 07:12 IST

కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ అజరామరమైన ప్రేమకథలో టైటిల్‌ పాత్రను సమంత (Samantha) పోషించగా.. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించారు. ఈ పాన్‌ ఇండియా సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 9న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ సినిమాని త్రీడీలో రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని