Shabaash Mithu: మిథాలీరాజ్‌ పాత్రను సవాలుగా స్వీకరించా: తాప్సీ

దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ (Mithali raj) జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శభాష్‌ మిథు’

Published : 14 Jul 2022 00:07 IST

హైదరాబాద్‌: దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ (Mithali raj) జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శభాష్‌ మిథు’ (Shabaash Mithu). శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి తాప్సీ (Taapsee) టైటిల్‌ పాత్ర పోషించారు. ఈ బయోపిక్‌ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తాప్సీ, మిథాలీ పాల్గొని, మాట్లాడారు.

‘‘క్రికెట్‌ ఎలా ఆడాలో ఈ సినిమా ప్రారంభించక ముందు వరకూ నాకు తెలియదు. ఈ సినిమా కేవలం క్రికెట్‌ గురించే కాదు మిథాలీ వ్యక్తిత్వానికీ సంబంధించిదని భావించి ముందడుగేశా. మిథాలీరాజ్‌ పాత్రను ఓ సవాలు స్వీకరించా. దానికి తగ్గట్టు నన్ను నేను మలచుకున్నా. సాధారణ చిత్రాలకంటే బయోపిక్‌లో నటించడం కొంచెం కష్టం. నా కెరీర్‌లో నేను బాగా కష్టపడిన సినిమా ఇదే. నేను ఆడిన క్రికెట్‌ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోందని నేను ఈ సినిమాను చేయలేదు. ఎందుకంటే నేను ట్రెండ్‌ను అనుసరించను. దానికి భిన్నంగా వెళ్లాలనుకుంటా. క్లాసిక్‌గా నిలిచే చిత్రాల్లో నటించాలనుకుంటా’’ అని తాప్సీ అన్నారు. ‘‘వ్యక్తిగతంగా నేను మితభాషిని. దానికి తగ్గట్టే ఈ సినిమాలో తాప్సీ ఎక్కువగా మాట్లాడకుండా కళ్లతోనే హావభావాలు పలికించింది. క్రికెట్‌ విషయానికొస్తే.. నేనెలా ఆడానో తానూ అంతే కష్టపడి ఆడింది. కొన్నాళ్ల క్రితం.. పరుగుల విషయంలో నేను పాత రికార్డులను బద్దలుకొట్టానని నాకు తెలియదు. నా సోషల్‌ మీడియా టీమ్‌ ద్వారా తెలుసుకున్నా. ఇలాంటి మైలురాళ్లను దాటినపుడు చాలా ఆనందంగా ఉంటుంది. క్రికెటర్‌గా నేను ప్రయాణం ప్రారంభించిన సమయంలో సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. కానీ, నా తల్లిదండ్రులు, కోచ్‌ల మద్దుతు ఎప్పుడూ ఉండేది. పేరు, డబ్బు కోసం నేను క్రికెట్‌ ఆడలేదు. అది నా ప్యాషన్‌. నా ఇష్టపూర్వకంగానే రిటైర్మెంట్‌ ప్రకటించా’’ అని మిథాలీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని