Shabaash Mithu: ‘ఆట మారితే.. రాత మారుతుంది’

భారత మహిళా దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శభాష్‌ మిథూ’. తాప్సీ పన్ను టైటిల్‌ పాత్ర పోషిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ చేతుల మీదుగా తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

Updated : 22 Jun 2022 07:05 IST

భారత మహిళా దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ (Mithali Raj) జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శభాష్‌ మిథూ’ (Shabaash Mithu). తాప్సీ పన్ను (Taapsee) టైటిల్‌ పాత్ర పోషిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ చేతుల మీదుగా తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. క్రికెటర్‌గా మారాలనుకున్న ఎనిమిదేళ్ల అమ్మాయి కల నిజమై, తను లెజెండ్‌గా ఎలా ఎదిగిందన్నది కథ. ‘యాటిట్యూడ్‌ మారితే.. ఆట మారుతుంది.. ఆట మారితే తల రాత మారుతుంది’ అనే సంభాషణతో ట్రైలర్‌ మొదలవుతుంది. ఒక ఆడపిల్ల క్రికెట్‌ ఆడాలనుకున్నప్పుడు ఎదురైన సవాళ్లు, చిన్నచూపు.. వాటిని తలచుకుంటూ తను ఆ కసిగా సాధన చేయడం.. అమ్మాయిల క్రికెట్‌లో అసమానతలపై పోరాడటం.. రికార్డులు సృష్టించడం.. ఇవన్నీ ట్రైలర్‌లో చూపించారు. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్‌ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌ నిర్మించింది. మరోవైపు తాప్సీ తాహిర్‌ రాజ్‌ భాసిన్‌తో కలిసి ‘లూప్‌ లపేటా’లో నటిస్తోంది. ‘దొబారా’, ‘బ్లర్‌’, ‘వో లఢ్‌కీ హై కహా?’, ‘డంకీ’లు వరుసలో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని