Viral: అక్షయ్‌ బ్యాటింగ్‌.. షారుఖ్‌ కీపింగ్‌..

ఇప్పుడో ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌కుమార్‌, షారుఖ్‌ఖాన్.. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండి.. అది ఇప్పటి వరకూ చూడనిది అయ్యుండి.. పైగా వాళ్లిద్దరూ క్రికెట్‌ ఆడుతుంటే వైరల్‌ కాకుండా ఎలా ఉంటుంది..! సుమారు పాతికేళ్ల క్రితం షారుఖ్‌ హీరోగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ చిత్రం విడుదలైంది.

Updated : 22 Jun 2021 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడో ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌కుమార్‌, షారుఖ్‌ఖాన్.. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండి.. అది ఇప్పటి వరకూ చూడనిది అయ్యుండి.. పైగా వాళ్లిద్దరూ క్రికెట్‌ ఆడుతుంటే వైరల్‌ కాకుండా ఎలా ఉంటుంది..! సుమారు పాతికేళ్ల క్రితం షారుఖ్‌ హీరోగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ చిత్రం విడుదలైంది. ఆ సినిమా చిత్రీకరణ సందర్భంగా.. విరామ సమయంలో అక్షయ్‌కుమార్‌, షారుఖ్‌ఖాన్‌ క్రికెటర్లుగా అవతారం ఎత్తారు. అక్షయ్‌ బ్యాటింగ్‌ చేయగా.. షారుఖ్‌ వికెట్ల(కుర్చీ) వెనక కీపింగ్‌ చేస్తూ ఆ ఫొటోలో కనిపించారు. ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో ఇప్పుడీ ఫొటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 1997లో వచ్చిన ‘దిల్‌ తో పాగల్‌ హై’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. అందులో షారుఖ్‌, మాధురి దీక్షిత్‌, కరిష్మాకపూర్‌ నటించారు.

చివరిగా 2018లో ‘జీరో’తో ప్రేక్షకులను అలరించిన షారుఖ్‌.. చాలాకాలం విరామం తర్వాత మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. షారుఖ్‌ తర్వాతి చిత్రం ‘పఠాన్‌’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపిక పదుకొణెతో కలిసి ఆడిపాడనుంది. మరోవైపు అక్షయ్‌కుమార్‌ సైతం వరుస చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. ‘పృథ్వీరాజ్‌ చౌహాన్‌’గా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటిస్తున్నాడు. బెల్‌బాటమ్‌, బచ్చన్‌పాండే, సూర్యవంశీ చిత్రాలతో పాటు ఆత్రంగి రే సినిమాలో సారా అలీఖాన్‌, ధనుష్‌తో కలిసి సందడి చేయనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని