Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్‌

రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ నటిస్తోన్న సినిమా ‘డంకీ’. తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఆయన దీని గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

Published : 27 Sep 2023 19:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పఠాన్‌’, ‘జవాన్‌’లతో ఈ ఏడాది వరుస విజయాలు అందుకున్న బాలీవుడ్‌ అగ్ర నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). ప్రస్తుతం ‘డంకీ’ (Dunki) సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చిన ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే లేడీఫ్యాన్‌ ఒకరు ‘మీ డింపుల్‌పై ముద్దు పెట్టుకోవచ్చా?’ అని అడిగారు. మరి, ఈ ప్రశ్నకు షారుక్‌ సమాధానమేంటో తెలుసుకోవాలనుందా..?

సర్‌.. మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?

షారుక్‌: కుడి వైపుదా, ఎడమ వైపుదా?దయచేసి అడ్వాన్స్‌ బుక్‌ చేసుకోండి.

నిద్రలేవగానే మీరు చేసే మొదటి పని ఏంటి? జవాన్‌లో మీకు నచ్చిన సన్నివేశమేది?

షారుక్‌: నా కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. జవాన్‌లో నాకు అన్ని సన్నివేశాలు ఇష్టమే. క్లైమాక్స్‌ సీన్‌ నాకెంతో ప్రత్యేకమైనది.

‘జవాన్‌’ కోసం లక్షలమంది థియేటర్‌కు వచ్చారు. ఎలా అనిపిస్తోంది?

షారుక్‌: నేను ఇంతమందిని అలరించగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమందికి వినోదాన్నిచ్చినందుకు ఓ నటుడిగా ఎంతో తృప్తిగా ఉంది.

‘పఠాన్‌’, ‘జవాన్’ల్లో ఉన్నట్లే ‘డంకీ’లో కూడా యాక్షన్‌ సన్నివేశాలను ఆశించవచ్చా?

షారుక్‌: ‘డంకీ’ ఎన్నో భావోద్వేగాలతో కూడిన వినోదాత్మక చిత్రం. రాజ్‌కుమార్‌ హిరాణీ ప్రపంచంలో యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉండొచ్చు. ఆయన మంచి దర్శకుడే కాదు.. ఎడిటర్‌ కూడా. అందుకే నేను వాటి గురించి ఇప్పుడు చెప్పలేను.

యశ్‌ చోప్రా గురించి ఒక్కమాటలో చెప్పండి?

షారుక్‌: ఆయన్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. ఈ సమయంలో ఆయన నా పక్కన ఉంటే ఎంతో సంతోషించేవాడిని. ఆయన్ని చాలా మిస్‌ అవుతున్నా.

2024లో ఏదైనా మాస్‌ సినిమా తీస్తారా?

షారుక్‌: నేను చాలా క్లాస్‌ హీరోని.

ఆ విషయం చెబితే మహేశ్‌ కంగారు పడ్డాడు: సుధీర్‌ బాబు

డంకీ సినిమా ఎలా ఉండనుంది?

షారుక్‌: చాలా బాగుంటుంది. నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది.

టైగర్‌-3 టీజర్‌ చూశారా?

షారుక్‌: అద్భుతంగా ఉంది. నాకెంతో నచ్చింది.

సర్‌.. ‘జవాన్‌’ ఫేక్‌ కలెక్షన్ల మాటేంటి? 

షారుక్‌:  వసూళ్లు ఎంతో మీరు శ్రద్ధగా లెక్కిస్తూ ఉండండి!

సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ విషయంలో మీ అభిమానులు ప్రశాంతంగా ఉండేలా ఓ సలహా ఇవ్వండి?

షారుక్‌: ఇది నిజంగా మంచి ఆలోచన. మనమందరం సహనం, గౌరవం కలిగి ఉండాలి. ఎవరిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించవద్దు. ప్రేమను మాత్రమే పంచాలి.

క్రికెట్‌ కోహ్లీ గురించి ఏమైనా చెప్పండి..

షారుక్‌: కోహ్లీ అంటే నాకు అభిమానం. అతడు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటా.

సర్‌.. ‘జవాన్‌’ చూసేందుకు టికెట్ల కోసం ప్రయత్నించగా అన్ని చోట్లా హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి..

షారుక్‌: ప్రియమైన వారితో కలిసి మీరు చూడాలనుకుంటే తగిన ఏర్పాట్ల గురించి నేను చూసుకుంటా.

‘డంకీ’ అనుకున్న తేదీనే వస్తుందా?

షారుక్‌: అవును. అనుకున్న తేదీనే (డిసెంబరు 22) రిలీజ్‌ ఫిక్స్‌.

ఓ రోజు ముందుగానే..!

షారుక్‌ ఖాన్‌కు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్‌ మార్కెట్‌లో ప్రభాస్‌ ‘సలార్‌’ కంటే ఒక రోజు ముందే (డిసెంబర్‌ 21) ‘డంకీ’ని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారట. ఈ మేరకు నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూటర్లకు సందేశాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. ‘జవాన్‌’కు కూడా ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘డంకీ’ (Dunki) విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా ప్రచారం విషయంలోనూ నిర్మాణసంస్థ కొత్త ప్రణాళికలు వేస్తోందట. ఈ సారి సౌత్‌లోనూ ప్రమోషన్స్‌ జోరు పెంచాలని నిర్ణయించుకున్నారట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని