Shah Rukh Khan: షారుక్‌కి నచ్చని లుంగీ డ్యాన్స్‌..

షారుక్‌ ఖాన్‌, దీపిక పదుకొణెలు నాయకానాయికలుగా దర్శకుడు రోహిత్‌శెట్టి పదేళ్ల కిందట తెరకెక్కించిన చిత్రం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’.

Updated : 17 Apr 2023 07:14 IST

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), దీపిక పదుకొణె (Deepika Padukone)లు నాయకానాయికలుగా దర్శకుడు రోహిత్‌శెట్టి పదేళ్ల కిందట తెరకెక్కించిన చిత్రం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’. అందులోని ‘లుంగీ డ్యాన్స్‌...’ పాట కుర్రకారుని ఉర్రూతలూపి, ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ గీతానికి సింగర్‌, ర్యాపర్‌ యోయో హనీసింగ్‌ స్వయంగా బాణీలు సమకూర్చి పాడారు. అయితే మొదట్లో ఈ సాంగ్‌ షారుక్‌కు పెద్దగా నచ్చలేదంటూ హనీసింగ్‌ ఆదివారం మీడియాతో ఆసక్తిర విషయం పంచుకున్నారు. ఈ పాటని సినిమాలో ఉంచాలా, తీసేయాలా.. అని నిర్ణయించడానికే షారుక్‌ మూడు వారాలకు పైగా సమయం తీసుకున్నారట. అంత టైం తీసుకోవడంతో.. అది నచ్చక హనీసింగ్‌ తర్వాత కొన్నేళ్లపాటు బాలీవుడ్‌కే దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ‘ఓరోజు షారుక్‌ భాయ్‌ నన్ను పిలిచి ఇంగ్లిష్‌ బీట్‌తో ఓ సాంగ్‌ చేయమన్నారు. దానికంటే పెద్ద హిట్‌ ఇచ్చేలా మంచి సాంగ్‌ చేస్తానని చెప్పి లుంగీ డ్యాన్స్‌ రూపొందించా. కానీ ఎందుకో అది ఆయనకు నచ్చలేదు. మూడు వారాలపాటు సతాయించి చివరికి ఓకే చేశారు’ అన్నారు. కానీ తర్వాత ఆ సాంగ్‌ పెద్ద సంచలనమే సృష్టించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని