Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్‌ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్‌!

షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) హీరోగా దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పఠాన్‌’. ఈ సినిమా విజయాన్ని ప్రస్తావిస్తూ షారుక్‌ను టామ్‌క్రూజ్‌(Tom Cruise) తో పోల్చడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. 

Published : 04 Feb 2023 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియా టామ్‌క్రూజ్‌ (Tom Cruise) అంటూ బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ను అభివర్ణించడంతో హాలీవుడ్‌ జర్నలిస్టుపై షారుక్‌ అభిమానులు మండిపడుతున్నారు. తమ అభిమాన నటుణ్ని ఎవరితోనూ పోల్చొద్దని కౌంటర్‌ వేశారు. షారుక్‌ తాజా చిత్రం ‘పఠాన్‌’ (Pathaan) ఇండియా, ఓవర్సీస్‌లో వసూళ్ల విషయంలో రికార్డు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికాకు చెందిన స్కాట్‌ అనే జర్నలిస్టు ఓ కథనం రాశారు. కొంతకాలంగా విజయాలకు దూరంగా ఉన్న బాలీవుడ్‌ను ‘ఇండియా టామ్‌ క్రూజ్‌’ షారుక్‌ ‘పఠాన్‌’తో కాపాడారంటూ అందులో పేర్కొన్నారు. ఆ వార్తకు సంబంధించిన వెబ్‌సైట్‌ లింక్‌ను తన ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. కథనం విషయం ఎలా ఉన్నా టామ్‌ క్రూజ్‌తో షారుక్‌ను పోల్చడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ హెడ్‌లైన్‌ మార్చుకోండి. షారుక్‌ అంటే షారుక్కే. షారుక్‌తో పోల్చేందుకు ఎవరూ సరిపోరు’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘‘మీ మాటలను సరిద్దుకోండి. షారుక్‌ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటుడు’ అని అన్నారు. ‘నేను ఈ ఇద్దరి నటులకు అభిమానినే. కానీ, ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు’, ‘టామ్‌క్రూజ్‌.. హాలీవుడ్‌ షారుక్‌ ఖాన్‌’ అంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

షారుక్‌ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమే ‘పఠాన్‌’. దీపికా పదుకొణె కథానాయికగా, జాన్‌ అబ్రహం విలన్‌ పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.696 కోట్లు వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. టామ్‌క్రూజ్‌.. ‘టాప్‌గన్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు