చిత్ర పరిశ్రమకు మరో స్టార్‌ హీరో కుమారుడు..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌(Aryan Khan) ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. 

Updated : 07 Dec 2022 13:50 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలోకి మరో స్టార్‌ హీరో కుమారుడు అడుగు పెట్టనున్నాడు. బాలీవుడ్‌ బాద్‌షాగా పిలుచుకునే షారుక్‌ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు  ఆర్యన్‌ ఖాన్‌(Aryan Khan) పరిశ్రమకు పరిచయం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్యన్‌ తన ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. షారుక్‌ నిర్మాణ సంస్థ ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’(Red Chillies Entertainment)తో తొలి ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆర్యన్‌ హీరోగా కాకుండ దర్శకుడుగా పరిచయం అవ్వనున్నాడు. 

ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన ఆర్యన్‌ ‘‘స్క్రిప్ట్‌ రాయడం పూర్తయింది. యాక్షన్‌ ఎప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తున్నా’’ అని రాశారు. ఇక ఈ పోస్ట్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. షారుక్‌ స్పందిస్తూ.‘‘ వావ్‌.. ఇప్పటి వరకు ఆలోచించావు, నీపై నమ్మకం పెంచుకున్నావు, ఎన్నో కలలు కన్నావు. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే సమయం వచ్చింది. తొలి ప్రాజెక్టు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఆల్‌ ది బెస్ట్‌’’ అని కామెంట్‌ చేశారు. ఇక షారుక్‌ భార్య గౌరీ మాట్లాడుతూ ‘నీ తొలి ప్రయత్నం కోసం ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆర్యన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా షారుక్‌-ఆర్యన్‌ మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నాన్న.. సెట్‌లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను’’ అని ఆర్యన్‌ అడగ్గా.. ‘‘అలా అయితే మీ షూటింగ్‌ కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే ఉండాలి. ఉదయం వేళలో కాదు’’ అంటూ షారుక్‌ చమత్కరించారు. ‘ఓకే.. కేవలం రాత్రి పూట మాత్రమే షూటింగ్‌ చేస్తా..’ అంటూ బదులిచ్చాడు ఆర్యన్‌. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు