SRK: సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు.. నేనూ అంతే : షారుఖ్ ఖాన్‌

షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) పఠాన్‌ సినిమా మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసింది. ఈ విజయం నేపథ్యంలో షారుఖ్‌ అభిమానులతో ముచ్చటించాడు.

Updated : 29 Jan 2023 11:44 IST

ముంబయి: ‘పఠాన్‌’ (Pathaan) సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్ (Shah Rukh Khan). యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలై.. మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈనేపథ్యంలో షారుఖ్‌ తాజాగా అభిమానులతో ముచ్చటించాడు. #ASKSRK వేదికగా ట్విపుల్‌తో సరదాగా సంభాషించాడు.

జవాన్‌ టీజర్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు?

షారుఖ్‌: త్వరలోనే పార్టీ జరగనుంది. అందుకోసం పటాసులు కొనడానికి మార్కెట్‌కు వెళ్లాలి.

‘పఠాన్‌’కు పబ్లిక్‌ నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?

షారుఖ్‌: డ్యాన్స్‌ చేశా, పాటలు పాడా, నవ్వుకున్నా.. ఎవరికి తెలుసు రేపు అనేది ఉంటుందో ఉండదో. ప్రేమతో ప్రతి విషయాన్నిసెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ‘పఠాన్‌’ సంబరాలు చేసుకునేటప్పుడు పక్కన వాళ్లను సైతం దయచేసి దృష్టిలో ఉంచుకోండి.

‘పఠాన్‌’ చూసిన తర్వాత మీ అబ్బాయి అబ్రామ్‌ స్పందన ఏమిటి?

షారుఖ్‌: సినిమా చూశాక వాడు నా వద్దకు వచ్చి.. ‘ఇదంతా కర్మపై ఆధారపడి ఉంటుంది’ అని చెప్పాడు. దాన్ని నేను నమ్ముతున్నా.

‘పఠాన్‌’ సృష్టిస్తోన్న రికార్డులు చూస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది?

షారుఖ్‌: మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లుగా ఉంది.

మీరు బయటకు ఎప్పుడు వస్తారు?

షారుఖ్‌: బ్రదర్‌.. ఎన్నో ఏళ్ల తర్వాత నేను థియేటర్‌కు వచ్చాను. కాసేపు ఇక్కడే ఉంటాను.

నన్ను అమ్మాయిలు ఇష్టపడటం లేదు. నాకు ఏదైనా టిప్స్‌ ఇవ్వండి?

షారుఖ్‌: టిప్స్‌ ఇచ్చేంత సమయం ఇప్పుడు లేదు.

జిమ్ (జాన్‌ అబ్రహం) కొడుతున్నప్పుడు ‘పఠాన్‌’కు ఎలా అనిపించింది?

షారుఖ్‌: జిమ్‌ దృఢమైన వ్యక్తి. నన్ను విపరీతంగా కొట్టాడు.. ఉఫ్‌..!! థ్యాంక్యూ దేవుడా.. నేను సురక్షితంగా అతడి నుంచి తప్పించుకున్నా.

నా ఐదేళ్ల కుమార్తె కూడా మిమ్మల్ని ‘పఠాన్‌’గా ఇష్టపడుతోంది..!

షారుఖ్‌: ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఈ పఠాన్‌ అంకుల్‌ కూడా తనని ఇష్టపడుతున్నాడని చెప్పండి.

కులం, మతం, ప్రాంతం అనే వాటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ‘పఠాన్‌’ని ప్రేమిస్తున్నారు.

షారుఖ్‌: మనమంతా భరతమాత బిడ్డలం ఇది నిజం. జై హింద్‌.

‘పఠాన్‌’ హిట్‌ అయ్యింది. కానీ, సల్మాన్‌తో బాక్సాఫీస్‌ వద్ద మీరు పోటీ పడలేరు?

షారుఖ్‌: సల్మాన్‌ భాయ్‌.. ఎప్పటికీ గొప్పవాడే.

‘పఠాన్‌’ బాక్సాఫీస్ నంబర్స్‌ చూశాక మీ ఫీలింగ్‌ ఏమిటి?

షారుఖ్‌: బ్రదర్‌ ఈ నంబర్స్‌ అనేవి కేవలం ఫోన్లలో సంభాషించుకోవడం వరకే.. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమను నేను లెక్కిస్తున్నాను.

‘పఠాన్‌’ కథ తెరకెక్కడానికి ముఖ్య కారణం ఎవరు?

షారుఖ్‌: ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్‌. మేమంతా వాళ్ల సూచనలు ఫాలో అయ్యాం అంతే.

‘జవాన్‌’లోనూ మీరు ఇలాగే ఫిట్‌గా కనిపిస్తారా?

షారుఖ్‌: అవును

అశుతోష్‌, డింపుల్‌ కపాడియాతో పని చేయడం ఎలా ఉంది?

షారుఖ్‌: వాళ్లిద్దరూ గొప్ప నటీనటులు. వాళ్లతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది.

మీరింత సెక్సీగా ఎలా ఉన్నారు?

షారుఖ్‌: అది చూసేవాళ్ల కళ్లల్లో ఉంటుంది.

‘పఠాన్‌’ కంటే ‘జీరో’నే చాలా బాగుంది?

షారుఖ్‌: మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు. కానీ, దురదృష్టవశాత్తు మీరు జీరోని లక్షల్లోనే వదిలేశారు.

ప్రమోషన్స్‌కు ఎందుకు దూరంగా ఉన్నారు?

షారుఖ్‌: సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు కాబ్టటి నేను కూడా ఈ సారి ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని