టైమ్‌కి వస్తా.. ఆలియాకు మాటిచ్చిన షారుఖ్‌

సాధారణంగా ఒక్క ఛాన్స్‌ అనే పదం సినిమా ఇండస్ట్రీలో ప్రవేశం కోసం ఎదురుచూసే వాళ్ల నోటి నుంచి వింటూ ఉంటాం. కానీ.. బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ నుంచి వస్తే.. అదీ ఇటీవల నిర్మాత అవతారం ఎత్తిన ఒక హీరోయిన్‌ను అడిగితే ఎలా ఉంటుంది..?

Published : 05 Jul 2021 01:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఒక్క ఛాన్స్‌ అనే పదం సినిమా ఇండస్ట్రీలో ప్రవేశం కోసం ఎదురుచూసే వాళ్ల నోటి నుంచి వింటూ ఉంటాం. కానీ.. బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ నుంచి వస్తే.. అదీ ఇటీవల నిర్మాత అవతారం ఎత్తిన ఒక హీరోయిన్‌ను అడిగితే ఎలా ఉంటుంది..? బాలీవుడ్‌ యువనటి అలియా భట్‌ ఇటీవల నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ‘డార్లింగ్స్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా.. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందని ప్రకటిస్తూ తన ఆనందాన్ని ట్విటర్‌లో పంచుకుంది. అదే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న షారుఖ్‌ఖాన్‌ ఆ ట్వీట్‌పై స్పందించాడు. అది కాస్తా ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ షారుఖ్‌ ఏం ట్వీట్‌ చేశాడంటే..

‘‘ఈ ప్రాజెక్టు పూర్తవగానే.. మీ సొంత నిర్మాణ సారథ్యంలో నాకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రమాణం చేసి చెబుతున్నా షూటింగ్‌కు సమయానికి వస్తా. హుందాగా వ్యవహరిస్తా’’ అని షారుఖ్‌ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇక ‘డార్లింగ్‌’ విషయానికి వస్తే.. ఈ సమాజంలో తమ ప్రాధాన్యతను తెలుసుకోవాలని అనుకునే తల్లి, కుతూళ్ల కథతో, ముంబయిలోని దిగువ మధ్య తరగతి కుటుంబాల నేపథ్యంలో తెరకెక్కించారు. జాస్మిత్‌ కె.రీన్‌ దర్శకత్వం వహించనున్నారు. విశాల్‌ భరద్వాజ్‌ సంగీతం అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని