Shahrukh khan: ఆగిపోయిన షారుఖ్‌ ఖాన్‌ చిత్రాల షూటింగ్‌?

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ (23) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కారణాలే ఇప్పుడు.. షారుఖ్‌ తదుపరి సినిమాల షూటింగ్స్‌పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 06 Oct 2021 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ (23) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కారణాలే ఇప్పుడు.. షారుఖ్‌ తదుపరి సినిమాల షూటింగ్స్‌పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రంతో వెండితెరపై కనిపించారు.అనంతరం ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఇంకా విడుదల కాలేదు.  ప్రస్తుతం ‘పఠాన్‌’తో పాటు దర్శకుడు అట్లీ చిత్రం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో కుమారుడు ఆర్యన్‌ అరెస్ట్‌ కావడంతో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ ఆగిపోయినట్లు సమాచారం. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకూ షారుఖ్‌ చిత్రాలకు దూరంగా ఉన్నట్లు నిర్ణయించుకున్నారట.  ఇక  ‘పఠాన్‌’ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌  ఇంటర్నేషనల్‌ షెడ్యూల్‌.. అక్టోబర్‌10న స్పెయిన్‌లో ఖరారు చేశారు. ఈ షెడ్యూల్‌లో షారుఖ్‌ దీపిక పదుకొణెతో ఓ రొమాంటిక్‌ సాంగ్ లోనూ అలాగే పలు యాక్షన్‌ సన్నివేశాలు చేయాల్సి ఉండగా.. అవి ఆగిపోయాయి. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో వచ్చే చిత్రం షూటింగ్‌.. సౌత్‌ముంబయిలో జరగాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాలను నిలిపివేశారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు