
కేజీయఫ్ ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా...
ఇంటర్నెట్ డెస్క్: కేజీయఫ్-2 కోసం తెలుగు, కన్నడ ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో.. స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ సినిమా విడుదల వాయిదా పడింది. టాలీవుడ్‌లో నానీ హీరోగా తెరకెక్కిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రిమేక్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ముందుగా 2021 డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా 2022 ఏప్రిల్ 14కి వాయిదా వేశారు. కానీ ఇదేరోజు కన్నడ సూపర్ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 విడుదల కానుండడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22కి మరోసారి వాయిదా వేశారు.
జెర్సీ చిత్ర నిర్మాత అమన్ గిల్ మాట్లాడుతూ.. ‘ఒక టీమ్‌గా, మేం మా రక్తాన్ని చెమటగా మలచి కన్నీళ్లతో జెర్సీని రూపొందించాం. ఈ చిత్రం విస్తృతమైన మార్గంలో మీ అందరి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ సినిమాని ఏప్రిల్ 22కు వాయిదా వేస్తున్నాం’ అని అన్నారు. పూర్తి క్రీడా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్, రోనిత్ కమ్రా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు, ఎస్. నాగ వంశీ, అమన్ గిల్ నిర్మించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
covid update: విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణలో 550 దాటిన కొత్త కేసులు
-
India News
Umesh Kolhe: ముందురోజు తప్పించుకున్నా.. తర్వాత చావు తప్పలేదు..!
-
India News
MK Stalin: ఆ సమయంలో పోలీసు భద్రతలో కాలేజీకి వచ్చి పరీక్షలు రాశా: సీఎం స్టాలిన్
-
Sports News
IND vs ENG: అక్కడే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చాం: జస్ప్రిత్ బుమ్రా
-
Movies News
Social Look: టాంజానియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ముంబయిలో తమన్నా జర్నీ!
-
Politics News
Revanth reddy: కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వట్లేదు: రేవంత్ రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!