Jersey: షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ హిందీ ట్రైలర్‌ చూశారా?

షాహిద్‌ కపూర్‌ కీలక పాత్రలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘జెర్సీ’. తెలుగులో

Updated : 23 Nov 2021 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షాహిద్‌ కపూర్‌ కీలక పాత్రలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘జెర్సీ’. తెలుగులో నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్నే గౌతమ్‌ హిందీలోనూ రూపొందిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌ బ్యాట్‌ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! అల్లు అరవింద్‌, దిల్‌రాజు, అమన్‌ గిల్‌; నాగవంశీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ నేపథ్య సంగీతం అందిస్తుండగా, సాకేత్‌, పరంపర స్వరాలు సమకూర్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని