Tollywood: హాలీవుడ్‌కు వెళ్లాలనుకోవడం లేదు.. సౌత్ సినిమాలు చేయాలనుకుంటున్నా: బాలీవుడ్ స్టార్ హీరో
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సౌత్ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పాడు. హాలీవుడ్ కంటే సౌత్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సినీ పరిశ్రమంతా సౌత్ సినిమాల వైపు చూస్తోంది. గత కొన్ని రోజులుగా దక్షిణాది చిత్రాలు వరుస విజయాలు సాధిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇతర పరిశ్రమల్లోని స్టార్ హీరోలు కూడా ఇక్కడ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కొంతమంది హీరోలు పలు ఇంటర్వ్యూల్లో తెలుపగా తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో కూడా తెలుగులో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టాడు.
తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న షాహిద్ కపూర్ (Shahid Kapoor) ‘హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే వెళ్తారా..?’ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ దక్షిణాది చిత్రాల గురించి ప్రస్తావించారు. ‘హాలీవుడ్ సినిమాల్లో మనకు గుర్తింపు ఉన్న పాత్రలు ఇవ్వరు. అందుకే నాకు అక్కడ నటించడం ఇష్టం ఉండదు. హాలీవుడ్‌లో నటించేకంటే సౌత్‌లో నటించడానికి ఆసక్తిగా ఉన్నాను. ఇక్కడ నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు ఇస్తారు. అలాంటి పాత్రలు ప్రతి నటుడికి ఉపయోగపడతాయి. అలాంటి చోట నటిస్తే నాలోని నటనను మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే హాలీవుడ్ (Hollywood) కంటే సౌత్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అని చెప్పాడు. ఇప్పటికే బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోలు చాలామంది తెలుగు సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్ లాంటి హీరోలు సౌత్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇక్కడ నటిస్తూ సూపర్ హిట్‌లను ఖాతాలో వేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: వచ్చే ఎన్నికల్లో చంద్రసేనకు 160 సీట్లు ఖాయం: అశ్వనీదత్
-
Elon Musk: మస్క్‌ను మలిచిన మూడు పుస్తకాలు.. బయోగ్రఫీలో వెల్లడించిన ప్రపంచ కుబేరుడు
-
Chandrababu Arrest: హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయొద్దంటే ఎలా?: తెదేపా మహిళా నేత జ్యోత్స్న
-
Chandrababu Arrest: ఏపీలో ప్రజాస్వామ్యానికి ప్రమాదఘంటికలు: నారా బ్రాహ్మణి
-
IRCTC: ఐఆర్సీటీసీ ఆఫర్.. విమాన టికెట్లపై ఆ ఛార్జీలు జీరో
-
Bajaj Pulsar N150: స్పోర్టీ లుక్‌లో కొత్త పల్సర్ N150.. ధర, ఇతర వివరాలివే