Shahid Kapoor: మలయాళ దర్శకుడితో షాహిద్‌ యాక్షన్‌

‘బ్లడీ డాడీ’ చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్‌ కపూర్‌ మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్‌, రాయ్‌ కపూర్‌ ఫిల్మ్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి.

Updated : 26 May 2023 14:05 IST

‘బ్లడీ డాడీ’ చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్‌ కపూర్‌ మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్‌, రాయ్‌ కపూర్‌ ఫిల్మ్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. మలయాళ సినిమాలు సెల్యూట్, కయంకులం కోచున్నిలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రోషన్‌ ఆండ్రూస్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక కేసులో భాగంగా పోలీసు అధికారి చేసే ఉత్కంఠభరితమైన పరిశోధనతో సాగే చిత్రమిది. ‘యాక్షన్‌, థ్రిల్లర్‌, డ్రామా, సస్పెన్స్‌ తో కూడిన కథలు దొరకడం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి ప్రాజెక్టులో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది. జీ స్టూడియోస్‌, రాయ్‌ కపూర్‌ ఫిల్మ్‌, దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌తో కలిసి పని చేయడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌ సినిమా చేయాడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను’ అని హీరో షాహిద్‌ కపూర్‌ అన్నారు. దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ మాట్లాడుతూ..‘ఇలాంటి గొప్ప టీమ్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకుంది’ అని అన్నారు. ఈ సినిమా 2023 చివరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 2024 విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని