Shahrukh khan: షారుక్‌ మెచ్చిన చెన్నై ఆతిథ్యం

షారుక్‌ ఖాన్‌ సినిమా సెట్లో రజనీకాంత్‌, విజయ్‌, నయనతార, విజయ్‌సేతుపతి, అనిరుధ్‌...ఇలా పలువురు కోలీవుడ్‌ తారలు సందడి చేశారు. ఇది షారుక్‌కు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Updated : 09 Oct 2022 13:10 IST

షారుక్‌ ఖాన్‌ సినిమా సెట్లో రజనీకాంత్‌, విజయ్‌, నయనతార, విజయ్‌సేతుపతి, అనిరుధ్‌...ఇలా పలువురు కోలీవుడ్‌ తారలు సందడి చేశారు. ఇది షారుక్‌కు (shahrukh khan) ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జవాన్‌’ (Jawan). ఈ సినిమా చిత్రీకరణ కొన్ని రోజులుగా చెన్నైలో జరుగుతోంది. శుక్రవారంతో ఈ సినిమా చెన్నై షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు షారుక్‌. ‘‘30 రోజులు ఎంతో అద్భుతంగా గడిచాయి. రజనీకాంత్‌ మా సెట్‌కి వచ్చి మా టీమ్‌ను ఆశీర్వదించారు. నయనతార నాతో కలిసి ఓ సినిమా చూశారు. అనిరుధ్‌ డ్యాన్స్‌తో అలరించారు. విజయ్‌ ఎంతో రుచికరమైన భోజనాన్ని నాకోసం తీసుకొచ్చారు. అట్లీ, ప్రియల ఆతిథ్యం అయితే అస్సలు మర్చిపోలేను. చికెన్‌ 65 వండటం నేర్చుకోవాలి’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘జవాన్‌’ సినిమాను వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు