Updated : 17 Aug 2022 10:18 IST

Shakini Dakini: శాలిని.. దామిని

దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్‌’కి రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘శాకిని డాకిని’ (Shakini Dakini). రెజీనా కసాండ్రా (Regina), నివేదా థామస్‌ (Nivetha Thamos) ప్రధాన పాత్రధారులు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్‌ కిమ్‌ నిర్మాతలు. ఈ సినిమాని సెప్టెంబర్‌ 16న విడుదల చేయాలని నిర్ణయించారు. మంగళవారం ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. నివేదా, రెజీనా... శాలిని, దామిని అనే పేర్లతో కనిపించనున్నట్టు స్పష్టమవుతోంది. ‘‘యాక్షన్‌ కామెడీ చిత్రమిది. అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇందులో ఉంద’’ని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: మైకీ మెక్‌క్లియరీ, నరేష్‌ కుమారన్‌, కూర్పు: విప్లవ్‌ నైషధం, కళ: గాంధీ నడికుడికర్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ప్రసాద్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని