Samantha: తళతళ శకుంతల

సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. పురాణాల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. శకుంతల పాత్రలో సమంత

Updated : 29 Apr 2022 14:02 IST

మంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. పురాణాల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, ఆమె మనసు దోచుకునే దుష్యంతుడి పాత్రలో దేవ్‌మోహన్‌ నటిస్తున్నారు. గురువారం సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఆమె పోషించిన శకుంతల పాత్ర లుక్‌ని విడుదల చేశారు.

విజయ్‌ దేవరకొండ సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు కొత్తగా చెప్పారు. శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి... షూటింగ్‌ జరుగుతున్నట్లు ఏర్పాట్లు చేసి... ఆమెను రప్పించారు. యాక్షన్‌ చెప్పిన తర్వాత... శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని