Shamshera: స్వాతంత్య్రం భిక్షకాదు.. పోరాడి సాధించాలి

‘కర్మ వల్ల దొంగలం..ధర్మంగా స్వతంత్రులం...’అంటూ పోరాడుతున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌.

Updated : 25 Jun 2022 09:07 IST

‘కర్మ వల్ల దొంగలం..ధర్మంగా స్వతంత్రులం...’అంటూ పోరాడుతున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor). ఆయన ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘షంషేరా’ (Shamshera). కరణ్‌ మల్హోత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటోంది. ఓ వైపు యోధుడిగా, మరో వైపు దొంగగా రణ్‌బీర్‌ ఆహార్యం, నటన అలరించేలా ఉన్నాయి. పోలీస్‌ అధికారి పాత్రలో సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) శక్తిమంతంగా కనిపించారు. ‘యాచించడానికి స్వాతంత్య్రం భిక్ష కాదు...పోరాడి సాధించుకోవాలి..’ లాంటి సంభాషణలతో పాటు ఇందులోని  పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. వాణీ కపూర్‌ కథానాయికగా యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని జులై 22న విడుదల చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని