Adipurush: ‘ఆదిపురుష్‌’డికి శరద్‌ డబ్బింగ్‌

అగ్ర హీరో ప్రభాస్‌, కృతి సనన్‌ నాయకానాయికలుగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది.

Updated : 30 Nov 2022 06:41 IST

అగ్ర హీరో ప్రభాస్‌ (Prabhas), కృతి సనన్‌ (Kriti Sanon) నాయకానాయికలుగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఓం రౌత్‌ దర్శకుడు. ప్రభాస్‌ రాముడి పాత్ర పోషిస్తుండగా, కృతి సీతగా నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా కనిపిస్తారు. నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రంలో హిందీలో ప్రభాస్‌ పాత్రకి శరద్‌ కేల్కర్‌ డబ్బింగ్‌ చెప్పనున్నారు. ‘రాముడి పాత్రకు గొంతు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ఓం రౌత్‌ మొదటి రోజు నుంచే నేను ప్రభాస్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పాలని భావించారు’ అంటూ శరద్‌ కేల్కర్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘ఆదిపురుష్‌’ వచ్చే ఏడాది జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని