Shah Rukh Khan: ఇలాంటివి ఎన్నో చూశాను.. ఏవీ సినిమా స్థాయిని తగ్గించలేవు..
బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్(Shah Rukh Khan) ఓటీటీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన రెడ్ సీ ఫెస్టివల్‌లో ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: 2022లో బాలీవుడ్‌లో చాలా సినిమాలు అనుకున్న స్థాయిలో అలరించలేదని దానికి ఒక కారణం ఓటీటీలని ఈ మధ్య కాలంలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan)స్పందించాడు. కొవిడ్ కారణంగా ప్రేక్షకులు కంటెంట్ చూసే విధానంలో మార్పు వచ్చిందన్నారు. మొబైల్ స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుందని అందులో సినిమా చూస్తే థియేటర్లో చూసిన అనుభూతి రాదన్నారు. సినిమా స్థాయిని ఏదీ తగ్గించలేదని షారుక్ అన్నారు.
ఇటీవల జరిగిన రెడ్ సీ ఫెస్టివల్(Red Sea Festival)లో షారుక్ మాట్లాడుతూ.. ‘నేను మూడు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నాను. ఇలాంటివి ఎన్నో చూశాను. టీవీలు వచ్చిన సమయంలో ‘టీవీ వచ్చింది ఇక థియేటర్లో సినిమాలు ఎవరు చూస్తారు’ అన్నారు. ఆ తర్వాత వీసీఆర్‌లు వచ్చాయి. ‘ఇక సినిమాలన్నీ వీసీఆర్‌లోనే చూస్తారని’ అన్నారు. కానీ ఏదీ మారలేదు. సినిమాను ఆదరించేవారు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. చలనచిత్ర రంగం కొత్తపుంతలు తొక్కుతూ నూతనోత్సాహంతో ముందుకు వస్తుంది’అని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే థియేటర్లో సినిమా చూస్తే ఔటింగ్‌కు వెళ్లినట్లు ఉంటుందని మొబైల్‌లో చూస్తే అలా ఉండదన్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత తన సినిమాను థియేటర్‌లో విడుదల చేయనున్నాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. తన తాజా చిత్రం ‘పఠాన్’(Pathaan)తో కమ్‌బ్యాక్‌కు సిద్ధమయ్యాడు. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. జాన్ అబ్రహం(John Abraham), దీపికా పదుకొణె(Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా