Nayan weds Vignesh: నయనతార పెళ్లిలో అతిథుల సందడి.. ఎవరెవరు వచ్చారంటే?

స్టార్‌ కపుల్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం గురువారం ఉదయం వేడుకగా జరిగింది. మహాబలిపురంలోని షెరిటన్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో...

Updated : 09 Jun 2022 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ కపుల్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక గురువారం ఉదయం జరిగింది. మహాబలిపురంలోని షెరిటన్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీతారలు సందడి చేశారు. బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ ప్రత్యేకార్షణగా నిలిచారు. తన తదుపరి చిత్రం ‘జవాన్‌’ దర్శకుడు అట్లీతో కలిసి ఆయన ఈ పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరులను అభినందించారు. అగ్రకథానాయకుడు రజనీకాంత్‌, ప్రముఖ దర్శకుడు మణిరత్నం, విజయ్‌ కార్తి, రాధికా శరత్‌కుమార్‌ దంపతులు, దిలీప్‌కుమార్‌, నిర్మాత బోనీ కపూర్‌... ఇలా పలువురు సెలబ్రిటీలు పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమ వివాహబంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఈరోజు మధ్యాహ్నం పెళ్లి ఫొటోలను విఘ్నేశ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు తమ జీవితాల్లో ప్రత్యేకమైన ఈ రోజుని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందితోపాటు 1800 మంది చిన్నారులకు భోజనం అందజేయాలని ఈ జంట నిర్ణయించుకుందట. ఈ మేరకు అభిమాన బృందాలతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని