Sharwanand: శర్వానంద్‌ సంగీత్‌లో రామ్‌చరణ్‌ సందడి

నటుడు శర్వానంద్ (Sharwanand) - రక్షితారెడ్డిల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన సంగీత్‌లో రామ్‌చరణ్‌ సందడి చేశారు.

Published : 03 Jun 2023 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు శర్వానంద్‌ (Sharwanand) మరికొన్ని గంటల్లో ఓ ఇంటివాడు కానున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ వేదికగా ఈ రోజు రాత్రి రక్షితారెడ్డిని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి నిర్వహించిన సంగీత్‌లో శర్వానంద్‌ మిత్రుడు, నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సందడి చేశారు. కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరు కుటుంబసభ్యులతో ఆయన సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, ఈ వేడుకలకు నటుడు సిద్దార్థ్‌, నటి ఆదితిరావు హైదరీ సైతం హాజరయ్యారు. మరోవైపు, పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పెళ్లికి హాజరు కానున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని