Sharwanand: సందడిగా శర్వానంద్‌ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్‌

నటుడు శర్వానంద్‌ (Sharwanand) పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని జైపుర్‌లో జరుగుతోన్న ఈ వేడుకలకు పలువురు హాజరయ్యారు.

Updated : 02 Jun 2023 17:35 IST

హైదరాబాద్‌: నటుడు శర్వానంద్‌ (Sharwanand)- రక్షితా రెడ్డి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ వేదికగా రెండు రోజులపాటు (జూన్‌ 2, 3 తేదీల్లో) ఇవి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ వేడుక నిర్వహించారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌రెడ్డి. ఆయన హైకోర్టు లాయర్‌. తల్లి సుధారెడ్డి.

ఇక, శర్వానంద్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్‌.. శ్రీరామ్‌ ఆదిత్యతో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. రెగ్యులర్‌ షూట్‌ ఇంకా మొదలు కాలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతోనే శర్వా కొంత విరామం తీసుకున్నారని.. త్వరలోనే షూట్‌లోకి అడుగుపెడతారని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని