Shatrughan Sinha: ‘మీ పని మీరుచూసుకోండి.. నేను నా కుమార్తె పెళ్లికి వెళ్తా’: శతృఘ్న సిన్హా

తన కుమార్తె సోనాక్షి సిన్హా వివాహం గురించి వార్తలు మొదలైన దగ్గరి నుంచి వస్తోన్న పలు కథనాలపై శతృఘ్న సిన్హా (Shatrughan Sinha) ఘాటుగా స్పందించారు. 

Published : 20 Jun 2024 18:00 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఆమె వివాహం బంధంలో అడుగుపెట్టనున్నారు. కుమార్తె వివాహానికి హాజరవుతానని నటుడు శతృఘ్నసిన్హా (Shatrughan Sinha) వెల్లడించారు.

‘‘ఇది నా ఒక్కగానొక్క కుమార్తె జీవితం. ఆమె అంటే నాకు అమితమైన ప్రేమ. నేనే తన బలం అని ఆమె చెప్పింది. తప్పకుండా ఆ పెళ్లికి వెళ్తాను.’’ అంటూ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. శతృఘ్న తన కుమార్తె వివాహానికి వెళ్లరంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ‘‘వారికి నా పాపులర్ డైలాగ్ ఖామోష్‌తో సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ఇది మీకు సంబంధం లేని విషయం. మీ పని మీరు చూసుకోండి’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.

సోనాక్షి వివాహం గురించిన వార్తలపై గతంలో ఆయన స్పందిస్తూ.. ‘‘సోనాక్షి వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దాని గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం మీడియాకు కూడా తెలుసని.. మీ కూతురి వివాహం గురించి మీకు తెలియదా అని చాలామంది నన్ను అడిగారు. నిజంగా నాకు ఈ విషయం గురించి తెలియదు. ఎందుకంటే సోనాక్షి  నాకేమీ చెప్పలేదు. ఒకవేళ నా కూతురి వివాహం జరిగితే.. బారాత్‌ ముందు డాన్స్‌ చేయడానికి రెడీగా ఉన్నా’’ అని సిన్హా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని