Deepika Padukone: రణ్‌వీర్‌ ఫొటోషూట్‌.. దీపికను టార్గెట్‌ చేసిన మోడల్‌

ఓ మ్యాగజైన్‌ కోసం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh) చేసిన ఫొటోషూట్‌ గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రణ్‌వీర్‌ నగ్నంగా ఫొటోలు దిగటాన్ని కొంతమంద...

Updated : 27 Jul 2022 12:55 IST

ముంబయి: ఓ మ్యాగజైన్‌ కోసం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh) చేసిన ఫొటోషూట్‌ గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రణ్‌వీర్‌ నగ్న ఫొటోలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై నటి, మోడల్‌ షెర్లిన్‌ చోప్రా (Sherlyn Chopra) ఆగ్రహం వ్యక్తం చేశారు. రణ్‌వీర్‌ ఫొటోషూట్‌ని తప్పుపట్టిన ఆమె దీపికాపదుకొణెని టార్గెట్‌ చేసింది. గతంలో తన దుస్తుల పట్ల దీపిక అవమానకరంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చింది.

‘‘గతంలో ఓ అవార్డు ఫంక్షన్‌కు నేను వేసుకువెళ్లిన దుస్తులు చూసి దీపిక నన్ను అసహ్యించుకుంది. కనీసం, నా ఒంటిపై దుస్తులైనా ఉన్నాయి. వాళ్లాయనలా నగ్నంగా ఫొటోలు దిగలేదు. అలాగే గతంలో ఓ ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ కోసం నేను కాస్త బోల్డ్‌గా ఫొటోలు దిగితే అందరూ నన్ను తిట్టారు. నా క్యారెక్టర్‌ని తప్పుపట్టారు. కానీ, ఇప్పుడు రణ్‌వీర్‌ ఫొటోషూట్‌పై ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. సమాజం కూడా ఎందుకిలా ద్వంద్వ ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియడం లేదు’’ అని షెర్లిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, ఇదే విషయంపై మరో నటి, మోడల్‌ అన్వేషి జైన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ రంగంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఏదైనా విషయం మనం చూసే ధోరణిలోనే ఉంటుంది. దీన్ని కేవలం ఫొటోషూట్‌గా చూస్తే.. ఇది పెద్ద సమస్యగా అనిపించదు. రణ్‌వీర్‌ కంటే ముందే ఎంతోమంది స్టార్స్‌ కెమెరా ముందు ఇలాంటి సాహసాలు చేశారు. ఈ ఫొటోషూట్‌ని ఆధారంగా చేసుకుని రణ్‌వీర్‌ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు. ఎందుకంటే ఇది కేవలం వర్క్ లైఫ్‌ మాత్రమే. పర్సనల్‌ లైఫ్‌ కాదు’’ అంటూ రణ్‌వీర్‌కి తన మద్దతు తెలిపారు.

ఓ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌ నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో వాటిని చూసిన నెటిజన్లు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ ఒక స్వచ్ఛంద సంస్థ, మహిళా న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌పై ముంబయి పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని