Mirzapur 4: ‘మీర్జాపూర్‌4’పై అప్‌డేట్‌ ఇచ్చిన నటి.. ప్రస్తుతం ఏం వర్క్‌ జరుగుతోందంటే!

‘మీర్జాపూర్‌4’పై బాలీవుడ్‌ నటి షెర్నావాజ్‌ జిజినా అప్‌డేట్‌ ఇచ్చారు. త్వరలోనే ఇది విడుదల కానుందన్నారు.

Published : 09 Jul 2024 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ (Mirzapur) ఒకటి. ప్రస్తుతం దీని మూడో సీజన్‌ ‘మీర్జాపూర్‌ 3’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సీజన్‌ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. తాజాగా దీని నాలుగో భాగంపై నటి అప్‌డేట్‌ ఇచ్చారు. 

మీర్జాపూర్‌ తొలి పార్ట్‌ నుంచి ఆ సిరీస్‌లో భాగమైన బాలీవుడ్‌ నటి షెర్నావాజ్‌ జిజినా (Sherrnavaz Jijina) తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాలుగో పార్ట్‌ గురించి మాట్లాడారు. ‘ప్రస్తుతం ‘మీర్జాపూర్‌ 4’ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఎంతోమంది దానికోసం పని చేస్తున్నారు. నాలుగో సీజన్‌ మీ ఊహకు మించి ఉంటుంది. ఆశ్చర్యపోయేలా దీన్ని రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నారు. టీమ్‌లో వాళ్లంతా ప్రతిభావంతులు. ఒకదాని తర్వాత మరో సీజన్‌ను వెంటనే విడుదల చేయడానికి వాళ్లు ఎలా వర్క్‌ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీనితర్వాత సీజన్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని పూర్తి నమ్మకం ఉంది’ అని చెప్పారు. ‘మీర్జాపూర్‌4’ (Mirzapur 4)అతి త్వరలోనే విడుదలవుతుందని ఆమె తెలిపారు.

‘కల్కి’ టీమ్‌కు హ్యాట్సాఫ్‌.. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండమే..: మహేశ్‌ బాబు

ఇక ఈ సిరీస్‌పై వస్తోన్న విమర్శలపై షెర్నావాజ్‌ స్పందించారు. ‘మిగతా వాటితో పోలిస్తే  ‘మీర్జాపూర్‌’ భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ గ్రాఫిక్స్‌ ఉపయోగించలేదు. అందుకే కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని మొదటిభాగం విడుదలైన సమయంలో ఎంతోమంది విమర్శించారు. హింసాత్మకంగా ఉందన్నారు. అయినా అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. హింసాత్మక సన్నివేశాలను చిత్రీకరించడం చాలా కష్టం. ప్రేక్షకులు ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని మేం అందిస్తాం. ఒకవేళ వాళ్లు ఇందులో హింసను చూడలేమంటే.. మేకర్స్‌ దానికి అనుగుణంగా తీస్తారు’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని