Rajkundra: నా భర్త అమాయకుడు : శిల్పాశెట్టి

అశ్లీల చిత్రాల నిర్మాణంలో తన భర్త రాజ్‌కుంద్రాకు ఎలాంటి సంబంధం లేదని బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ‘పోర్న్‌ రాకెట్‌’ కేసు....

Published : 24 Jul 2021 16:38 IST

ముంబయి: అశ్లీల చిత్రాల నిర్మాణంలో తన భర్త రాజ్‌కుంద్రాకు ఎలాంటి సంబంధం లేదని బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి చెప్పినట్టు తెలుస్తోంది. ‘పోర్న్‌ రాకెట్‌’ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సాయంత్రం ముంబయి పోలీసులు శిల్పాని ఆరుగంటలపాటు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. కుంద్రా వ్యాపారాలతో శిల్పాకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే విషయంపై పోలీసులు ఆరా తీశారు.

కాగా, విచారణలో భాగంగా.. తన భర్త రాజ్‌ ఏమీ తెలియని అమాయకుడని.. అతను కేవలం వెబ్‌సిరీస్‌లు మాత్రమే తెరకెక్కించేవాడని.. అశ్లీల చిత్రాలు నిర్మించడంలో అతనికి ఎలాంటి భాగస్వామ్యం లేదని ఆమె తెలిపినట్లు సమాచారం. ‘పోర్న్‌ రాకెట్‌’ కేసులో కీలకంగా మారిన ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ లండన్‌కు చెందినదని.. దాని వ్యవహారాలు మొత్తం రాజ్‌కుంద్రా బావ ప్రదీప్‌ బక్షి చూసుకుంటున్నారని.. అందులో ఎలాంటి కంటెంట్‌ వస్తుందనే దానిపై తనకి ఎలాంటి అవగాహన లేదని.. ఆ యాప్‌లో తనకి ఎలాంటి భాగస్వామ్యం లేదని ఆమె పోలీసులకు తెలిపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలతో సోమవారం అరెస్టైన రాజ్‌కుంద్రాకు జులై 27 వరకూ పోలీస్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని