Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి

ప్రముఖ నటి శిల్పాశెట్టికి గాయమైంది. తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణలో ఆమె ఎడమ కాలికి దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చికిత్స పొందిన ఆస్పత్రిలో దిగిన ఫొటోని శిల్ప సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘వైద్యులు ఆరు వారాలు విశ్రాంతి తీసుకోమన్నారు.

Published : 11 Aug 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి శిల్పాశెట్టికి (Shilpa Shetty) గాయమైంది. తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force) వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణలో ఆమె ఎడమ కాలికి దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో దిగిన ఫొటోని శిల్ప సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘వైద్యులు ఆరు వారాలు విశ్రాంతి తీసుకోమన్నారు. మరింత దృఢంగా త్వరలోనే తిరిగొస్తా’’ అని శిల్ప తెలిపారు. ‘‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ సిరీస్‌ దర్శకులు.. రోల్‌, కెమెరా, యాక్షన్‌.. బ్రేక్‌ ఏ లెగ్‌! (అద్భుతంగా నటించండి) అని అన్నారు. నేను దాన్ని నిజం చేశా’’ అంటూ శిల్ప నవ్వుల ఎమోజీలు జత చేశారు. ఈ పోస్ట్‌ చూసిన ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ కాప్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా, వివేక్‌ ఒబెరాయ్‌, ఇషా తల్వార్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రోహిత్‌ శెట్టి, సుశ్వంత్‌ ప్రకాశ్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌ 2023లో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో (Amazon Prime Video) విడుదల కానుంది. ‘బాజీగర్‌’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన శిల్ప ‘సాహస వీరుడు సాగరకన్య’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత, ‘వీడెవడండీ బాబూ’, ‘ఆజాద్‌’, ‘భలేవాడివి బాసూ!’ చిత్రాలతో అలరించారు. ఈ ఏడాది ‘నికమ్మ’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని