Shilpa Shetty: ‘సూపర్‌ డ్యాన్సర్‌’ షోలో శిల్పాశెట్టికి ఘన స్వాగతం

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి సెట్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో ఆమె ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. వివాదాల్లో చిక్కుకున్నామె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న ‘సూపర్‌ డ్యాన్సర్‌’ రియాలిటీ షోలో పాల్గొనలేకపోయారు. ఇటీవలే తిరిగి సూపర్‌ డ్యాన్సర్‌ షోలో

Updated : 08 Dec 2022 17:52 IST

 షోలో భావోద్వేగానికి గురైన బాలీవుడ్‌ సుందరి

ముంబయి: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి సెట్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడంతో ఆమె ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న ‘సూపర్‌ డ్యాన్సర్‌’ రియాలిటీ షోలో పాల్గొనలేకపోయారు. ఇటీవలే తిరిగి సూపర్‌ డ్యాన్సర్‌ షోలో రీఎంట్రీ ఇచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. డ్యాన్స్‌సెట్‌లోకి అడుగుపెట్టంగానే ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆమెను పక్కనే ఉన్న న్యాయనిర్ణేతలు అనురాగ్‌బసు, గీతాకపూర్‌ ఓదార్చారు. ఈ సందర్భంగా అనురాగ్‌ బసు మాట్లాడుతూ..‘‘శిల్పా.. సెట్‌లో నిన్ను చాలా మిస్ అయ్యాం. మనమంతా ఓ కుటుంబం. అలాంటి కుటుంబంలో ఓ వ్యక్తి లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు మాకెంతో ఆత్మీయురాలివి’’ అంటూ అక్కునచేర్చుకున్నారు. ఇటు భర్త రాజ్‌కుంద్రా అరెస్టు, తల్లి సునందశెట్టి పై కేసులతో వరుసగా సతమతమైన శిల్పా మానసికంగా ఇబ్బందిపడ్డారు. ఈ కారణంగా సోషల్‌మీడియా, రియాలిటీషోకి దూరంగా ఉండాల్సివచ్చింది. 

మానసిక ఉల్లాసం, కుటుంబం కోసమే మళ్లీ వస్తున్నా
శిల్పా షోలో రీఎంట్రీ కోసం నిర్మాతలు ఆమెతో నిత్యం టచ్‌లో ఉన్నారట. దీంతో పరిస్థితులు ఎలా ఉన్నాసరే మునుపటిలా పనిపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకొన్నారు. పిల్లలు, కుటుంబం కోసమే కాదు.. మానసికంగా కుదుటపడేందుకు ఆమె పనిలో పడ్డారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని