Shivani Rajasekhar: శివాని, రాహుల్‌ జోడీ.. మరో చిత్రానికి రెడీ

నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాని, రాహుల్‌ విజయ్‌ జంటగా మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా మరో సినిమాతో సందడి చేసేందుకు ఈ జంట సిద్ధమైంది. ఈ ఇద్దరు ప్రధాన పాత్రలో తేజ మర్ని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Published : 30 Jun 2022 22:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాని (Shivani Rajasekhar), రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay) జంటగా మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా మరో సినిమాతో సందడి చేసేందుకు ఈ జంట సిద్ధమైంది. ఈ ఇద్దరు ప్రధాన పాత్రలో తేజ మర్ని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, మురళీ శర్మ, బెనర్జీ, పవన్‌తేజ్‌ కొణిదెల తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జగదీశ్‌ చీకటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. పాత్రలకంటే కథే ప్రధానంగా సాగే ఈ చిత్ర టైటిల్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.

తేజ మర్ని ఇంతకు ముందు ‘జోహార్‌’, ‘అర్జున ఫల్గుణ’ చిత్రాలను తెరకెక్కించి, ప్రేక్షకుల్ని మెప్పించారు. మణికాంత్‌ గెల్లి ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో ఆకట్టుకున్నారు. ‘ఈ మాయ పేరేమిటో’, ‘సూర్యకాంతం’ చిత్రాలతో మెప్పించిన హీరోనే రాహుల్‌ విజయ్‌. ‘అద్భుతం’, ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’, ‘శేఖర్‌’ చిత్రాలతో సందడి చేశారు శివాని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని