Pippa: యుద్ధ ట్యాంక్‌ ‘పిప్పా’ వచ్చేసింది!

ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పిప్పా’. ‘1971: ఎ నేషన్‌ కమ్స్‌ ఆఫ్‌ ఏజ్‌’ అనేది ఉపశీర్షిక.

Published : 16 Sep 2021 11:34 IST

ముంబయి: అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ఎయిర్‌ లిఫ్ట్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు రాజా కృష్ణ మీనన్‌. ఇప్పుడు ఆయన నుంచి రానున్న తాజా చిత్రం ‘పిప్పా’. ‘1971: ఎ నేషన్‌ కమ్స్‌ ఆఫ్‌ ఏజ్‌’ అనేది ఉపశీర్షిక. ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. అంతేకాకుండా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను అమృత్‌సర్‌లో పూర్తి చేశారు. బ్రిగేడియర్‌ బలరామ్‌ సింగ్‌ మెహతాగా ఇషాన్‌ నటిస్తున్నారు. రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ నిర్మిస్తున్నారు. బలరామ్‌ సింగ్‌ రాసిన ‘ది బర్నింగ్‌ ఛాఫ్పీస్‌’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

రోనీ మాట్లాడుతూ ‘‘బ్రిగేడియర్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా క్లాప్‌తో మా సినిమా మొదలు కావడం సంతోషంగా ఉంది. అడ్డంకులు వచ్చినా విజయవంతంగా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశాం’’అని చెప్పారు. ‘‘ఇంత గొప్ప కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి తగ్గట్టే మంచి చిత్రబృందం నాకు దొరికింది’’అన్నారు దర్శకుడు రాజా కృష్ణ మీనన్‌. దీనికి ఏ ఆర్‌ రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు. 1971 ఇండో పాక్‌ యుద్ధ విజయంలో భారత్‌కు కీలకంగా నిలిచిన యుద్ధట్యాంకు పిప్పా నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని