WTCfinal: పూనమ్‌ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు

గగతంలో భారత జట్టు 2011 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిస్తే బట్టలు లేకుండా మైదానంలో తిరుగుతానంటూ నటి పూనమ్‌పాండే ప్రకటించి దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసిందామె.

Updated : 23 Jun 2021 06:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో భారత జట్టు 2011 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిస్తే బట్టలు లేకుండా మైదానంలో తిరుగుతానంటూ నటి పూనమ్‌పాండే ప్రకటించి దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసిందామె. ప్రస్తుతం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆఖరి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ మ్యాచ్‌ గురించి స్పందించమని కోరగా.. ఆమె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

‘‘క్రికెట్‌ మొదలైందా..? జనం క్రికెట్‌ ఆడుతున్నారా..? ఈసారి కూడా భారత జట్టు గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అయితే.. ఈ మ్యాచ్‌ గురించి నాకు తెలియదు. ఇంటికి వెళ్లి తెలుసుకుంటా’’ అని చెప్పింది. కాగా, ఆమె చేసిన వ్యాఖ్యలపై తన భర్త ‘‘నీకు బదులుగా ఈసారి నేను నగ్న ప్రదర్శన చేస్తా’’ అంటూ స్పందించాడు. దానికామె ‘‘వద్దులే నువ్వు చేస్తే ఇండియా ఓడిపోతుంది’’ అంటూ బదులిచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అనిపించడం లేదా అని ప్రశ్నించగా.. ‘‘నేను నా దేశం గెలవాలని కోరుకుంటున్నా.. అందులో తప్పేం ఉంది. క్రికెట్‌ను ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నేను కూడా ఇష్టపడతాను. దేశ ప్రజలకు నేను వినోదం పంచుతున్నాను’’ అని తన మాటలను సమర్థించుకుందామె.

మితిమీరిన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్‌ నటి పూనమ్‌. తెలుగులో ‘మాలిని అండ్‌ కంపెనీ’ అనే చిత్రంలో నటించింది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ పేరు తెచ్చుకున్న పూనమ్‌.. సామ్‌ బాంబేను వివాహం చేసుకుంది. పెళ్లైన 13 రోజులకే.. అతడు తనను శారీరకంగా హింసిస్తున్నాడని గృహహింస కేసు పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని