నాగశౌర్య సిక్స్‌ ప్యాక్‌ లుక్స్‌..!

బర్త్‌డే బాయ్‌ నాగశౌర్య.. ‘వరుడి’గా రెడీ అవుతున్నట్లున్నారు. తాజాగా ఆయన సిక్స్‌ప్యాక్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. గతేడాది విడుదలైన ‘అశ్వథ్థామ’ తర్వాత నాగశౌర్య వరుస ప్రాజెక్ట్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిల్లో ఫ్యామిలీ, లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’

Updated : 22 Jan 2021 11:33 IST

వీడియోతో ఫిదా చేస్తున్న హీరో

హైదరాబాద్‌: బర్త్‌డే బాయ్‌ నాగశౌర్య.. ‘వరుడి’గా రెడీ అవుతున్నట్లున్నారు. తాజాగా ఆయన సిక్స్‌ప్యాక్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. గతేడాది విడుదలైన ‘అశ్వథ్థామ’ తర్వాత నాగశౌర్య వరుస ప్రాజెక్ట్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిల్లో ఫ్యామిలీ, లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’ ఒకటి. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా రీతూవర్మ సందడి చేయనున్నారు. శుక్రవారం హీరో పుట్టినరోజు సందర్భంగా.. ‘వరుడు కావలెను’ టీమ్‌ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. చిత్రంలో శౌర్య ఎలా కనిపించనున్నారనేది ఈ వీడియోలో చూపించారు. వీడియో ఆరంభంలో శౌర్య సిక్స్‌ ప్యాక్‌ లుక్స్‌తో అభిమానులను ఫిదా చేశారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.

ఇదీ చదవండి

రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్‌ బయటపెట్టేస్తుంది..!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని