Shraddha Kapoor: డేటింగ్‌ రూమర్స్‌పై స్పష్టతనిచ్చిన నటి!

బాలీవుడ్‌ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ పెట్టిన ఓ పోస్ట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. రైటర్‌ రాహుల్‌ మోదీతో దిగిన ఫొటోను ఆమె పంచుకున్నారు.

Published : 19 Jun 2024 17:26 IST

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌.. రైటర్‌ రాహుల్‌ మోదీతో డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రద్ధ (Shraddha Kapoor) తాజాగా రాహుల్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అతడి చేతిని పట్టుకొని నవ్వుతూ కనిపించారు. ‘నా మనసును తీసుకెళ్లు.. కానీ, నా నిద్రను తిరిగిచేయ్‌’ అనే క్యాప్షన్‌ పెట్టారు. నవ్వుతున్న ఎమోజీలతో పాటు హార్ట్‌ సింబల్‌ను జోడించారు. దీంతో ఆమె అధికారికంగా తన రిలేషన్‌ను చెప్పేశారని అభిమానులు అంటున్నారు. కొందరు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఆ పోస్ట్‌ను షేర్‌ చేస్తున్నారు.

షూటింగ్‌లో గాయపడిన స్టార్‌ హీరోయిన్‌

గతేడాది వచ్చిన ‘తు ఝూతి మైన్ మక్కార్’ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉంటున్నట్లు వార్తలు ప్రారంభమయ్యాయి. ఆ సినిమాకు రాహుల్‌ రైటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో జరిగే ఈవెంట్లకు, పార్టీలకు ఇద్దరూ కలిసి హాజరుకావడంలో అవి జోరందుకున్నాయి. అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లోనూ ఈ జంట తళుక్కున మెరిసింది. ఇటీవల ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌లో ‘ఆర్‌’ అనే అక్షరం ఉన్న లాకెట్‌ను వేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని